చీరాల, అక్టోబర్ 5 : చీరాల నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అన్నారు. పల్లె పండుగ 3.0లో భాగంగా ఈపురుపాలెం సిండికేట్ వీవర్స్ కాలనీలో రూ.30 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, రహదారుల నిర్మాణంతో ప్రజలకు మెరుగైన రాకపోకల సౌకర్యం కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

