Homeఆంధ్రప్రదేశ్కాకినాడదూకుడు పెంచిన అన్నవరం.. జోరందుకున్న ఎన్నికల ప్రచారం

దూకుడు పెంచిన అన్నవరం.. జోరందుకున్న ఎన్నికల ప్రచారం

అండగా మేమున్నామంటూ సర్పంచ్ అభ్యర్థికి భరోసా ఇస్తున్న నాయకులు

కాజులూరు, పెన్ పవర్, నవంబర్ 23: కాజులూరు మండల పరిధిలోని గొల్లపాలెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ హైకోర్టు న్యాయవాది రెడ్డి అన్నవరం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 29న జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. న్యాయవాద వృత్తిలో తీరిక లేకుండా ఉన్నప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో సర్పంచ్ బరిలో నిలిచినట్లు అన్నవరం తెలిపారు. ప్రజలు తనకు అవకాశం కల్పిస్తే గొల్లపాలెం గ్రామ పంచాయతీని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, ప్రజారోగ్య సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులకు ఉపయోగపడేలా పార్కు అభివృద్ధి, వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన అజెండా అని పేర్కొంటూ తనకు ఓటు వేసి సర్పంచ్‌గా గెలిపించాలని ఓటర్లను వినమ్రంగా కోరుతున్నారు.

సోమవారం సీనియర్ నాయకులు గుబ్బల యేసురాజు, ప్రముఖ వ్యాపారవేత్త నల్లమిల్లి ఈశ్వరరెడ్డి, తోట కృష్ణ తదితరులు అన్నవరానికి మద్దతుగా నిలిచి ప్రచారంలో పాల్గొన్నారు. వారి ఆధ్వర్యంలో మత్స్యకార కాలనీ, సాయిబాబా కాలనీల్లో పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అభ్యర్థికి అండగా ఉంటామని నాయకులు భరోసా ఇస్తూ ప్రచారంలో ముందుకు సాగారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular