పర్చూరు, అక్టోబర్ 5: ప్రపంచ మెనింజైటిస్ దినోత్సవం సందర్భంగా ఉప్పుటూరు పంచాయతీ కార్యాలయం వద్ద ప్రభుత్వ హోమియో వైద్యాధికారి డాక్టర్ దాసరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మెనింజైటిస్ లక్షణాలు, వ్యాధి నివారణ చర్యలపై ఆయన వివరించారు. తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు, మెడ బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సేవకురాలు కే. నాగరాజా, రోగులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

