బాపట్ల, అక్టోబర్ 5 : ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో రూ.5 కోట్లతో చిల్లర గొల్లపాలెంలో నిర్మించిన పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ కేంద్రం నూతన భవనాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ, చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం.కొండయ్య, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ వి. తదితరులు పాల్గొన్నారు.
🔴 కేంద్రంలో పరిశోధన కేంద్రం, వర్క్‌షాప్, శిక్షణ కేంద్ర భవనాల ప్రారంభం
🔴 ఇంక్యుబేషన్ సెంటర్, అధునాతన యంత్ర పరికరాలను పరిశీలించిన మంత్రి, ఎమ్మెల్యేలు
🔴 ఆధునిక సాంకేతికతతో రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు: ఏలూరి
🔴 ప్రాసెసింగ్, నిల్వ, విలువ జోడింపుతో పంటలకు మెరుగైన ధరలు

