Homeఆంధ్రప్రదేశ్బాపట్లవిద్యుత్ సేవా సేతు కార్యక్రమం

విద్యుత్ సేవా సేతు కార్యక్రమం

చీరాల, అక్టోబర్ 6: చీరాల క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విద్యుత్ సేవా సేతు’ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సూర్య ఘర్–ముఫ్త్ బిజ్లీ యోజనపై ప్రజలకు అవగాహన కల్పించారు. రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటు, సబ్సిడీ, దరఖాస్తు విధానం, నెట్‌ మీటరింగ్‌ తదితర అంశాలను అధికారులు వివరించారు.

ఇంటి పైకప్పుపై సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు సేవా సేతు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని సోలార్‌ విద్యుత్‌ ప్రయోజనాలు పొందాలని కోరారు. ఏపీసీపీడీసీఎల్ పరిధిలో అక్టోబర్‌ 6, 7, 8 తేదీల్లో సేవా సేతు క్యాంపులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు, వినియోగదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular