Homeఆంధ్రప్రదేశ్బాపట్లచెరువుల్లో చేపల వేటపై నిషేధం

చెరువుల్లో చేపల వేటపై నిషేధం

కారంచేడు అక్టోబర్ 8: ఆదిపూడి గ్రామంలోని మంచినీటి చెరువుల్లో చేపలు పట్టడం, గాలాలు వేయడం, చెరువు పరిసరాల్లో మద్యపానం చేయడాన్ని గ్రామ పంచాయతీ నిషేధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.3 వేల జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పంచాయతీ అభివృద్ధి అధికారి ఎల్.కె. కృష్ణ తెలిపారు. ఉల్లంఘనలను ఫొటోలు, ఆధారాలతో పంచాయతీకి తెలియజేసిన వారికి రూ.500 బహుమతి అందజేస్తామని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు చెరువుల పరిరక్షణకు సహకరించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular