Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లియాతపేట, పెదబొడ్డేపల్లిలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్

యాతపేట, పెదబొడ్డేపల్లిలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్

నర్సీపట్నం, పెన్ పవర్ :

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, అక్రమ మద్యం, నాటుసారా రవాణా నియంత్రణ లక్ష్యంగా నర్సీపట్నంలోని యాతపేట, పెదబొడ్డేపల్లి ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నర్సీపట్నం డీఎస్పీ పర్యవేక్షణలో చేపట్టిన ఈ తనిఖీల్లో 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం టౌన్ సీఐ ఎస్. గఫూర్, ఎస్‌ఐలు ఉమా మహేశ్వరరావు, రమేష్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్‌ఐ కిరణ్‌తో పాటు సుమారు 50 మంది పోలీసు సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, ఇళ్లు, ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించడంతో పాటు వాహనాల రిజిస్ట్రేషన్, ఇతర పత్రాలను పరిశీలించి తదుపరి చర్యల కోసం వివరాలు సేకరించారు.

ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా జరిగేలా పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోందని అధికారులు తెలిపారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అక్రమ మద్యం పంపిణీ చేయడం, నాటుసారా విక్రయాలు, అక్రమ నగదు రవాణా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular