Homeతెలంగాణఘనంగా దేవేరులకు పుష్పయాగం

ఘనంగా దేవేరులకు పుష్పయాగం

 

గార్ల, పెన్ పవర్, అక్టోబర్: 31

శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గార్ల మండల పరిధిలోని మర్రిగూడెం గ్రామంలో కొలువుదీరిన శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాల యంలో శనివారం పుష్పయాగం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రీ భూ నీల గోదా సమేత వెంకటేశ్వర స్వామివార్లకు ఆలయ అర్చకులు విష్ణు సహస్రనామ అష్టో త్తర శతనామార్చన విశేష పూజలతో పాటుగా వివిధ రకాల పూలతో పుష్ప యాగం నిర్వహించారు. పుష్పాలతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించడంతో ఆలయ ప్రాంగణం భక్తిమయంగా మారింది ఈ సందర్భంగా స్వామివారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అజ్మీరా బన్సీలాల్ వైస్ చైర్మన్ అర్జునా మాజీ జెడ్పిటిసి ఝాన్సీ లక్ష్మి రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి కస్నా నాయక్  ఆలయ కమిటీ సభ్యులు పల్లెపంగు నాగరాజు టీటీడీ సభ్యులు రాములు నాయక్   వీరన్న వేమిశెట్టి శ్రీనివాస్ అర్చకులు రామాయణం అచ్యుతాచార్యులు
గోవిందా చార్యులు హర్ష చార్యులు విష్ణు చార్యులు
సందీప్ చార్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular