Homeతెలంగాణహైదరాబాద్గుండెపోటుతో జర్నలిస్టు భీమనపల్లి శేఖర్ మృతి

గుండెపోటుతో జర్నలిస్టు భీమనపల్లి శేఖర్ మృతి

గుండెపోటుతో జర్నలిస్టు భీమనపల్లి శేఖర్ మృతి

శేఖర్ కు నివాళులర్పించిన డియూడబ్ల్యూజే, ఐజేయు నేతలు

ఎల్బీనగర్, పెన్ పవర్, నవంబరు 2:

ప్రజాశక్తి, సూర్య దినపత్రికల్లో జర్నలిస్టుగా పనిచేసిన భీమనపల్లి శేఖర్ గుండెపోటుతో ఆదివారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందాడు. శేఖర్ మృతి చెందిన విషయం తెలుసుకున్న టీయూడబ్ల్యూజే (ఐజేయు) రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సత్యనారాయణ, తెలంగాణ రాష్ట నాయకులు, సీనియర్ జర్నలిస్ట్ జే.కిషన్(రాధాకిషన్), జిల్లా సంయుక్త కార్యదర్శి గొల్లంపల్లి ఆంజనేయులు, ట్రెజరర్ శశిపాల్ రెడ్డి , సీనియర్ జర్నలిస్టులు బాణాల మధుసూదనాచారి, చాపల శ్రీనివాస్, నర్రి రమేష్, దేవయ్య తదితరులు శేఖర్ పార్దివదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుడు శేఖర్ కుటుంబానికి అండగా ఉంటామని ఐజేయు నేతలు భరోసా కల్పించారు. నివాళులు అర్పించిన వారిలో పలువురు ప్రముఖులు, జర్నలిస్టులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular