Homeఆంధ్రప్రదేశ్ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పటిష్ట బందోబస్తు:150 మంది పోలీసులతో నిరంతర నిఘా

ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పటిష్ట బందోబస్తు:150 మంది పోలీసులతో నిరంతర నిఘా

గూడెంకొత్తవీధి,పెన్ పవర్,నవంబర్ 2 :ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చింతపల్లి డివిజన్ పరిధిలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఏఎస్పీ నిరంజన్ మహేంద్ర సిన్హా తెలిపారు. సోమవారం గూడెంకొత్తవీధిలో సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసులతో ఎన్నికల భద్రతా కవాతు నిర్వహించారు. ఎన్నికల విధుల్లో సుమారు 150 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సై సురేష్, పోలీసు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular