Homeతెలంగాణదళిత, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలి

దళిత, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలి

దళిత, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలి

డిసెంబర్‌ 6న అంబేద్కర్‌ వర్ధంతికి దేశవ్యాప్తంగా ఉచిత రైలు సౌకర్యం కల్పించాలి

పేద దళిత కుటుంబాలకు పీఎంజీపీ పథకం అందించాలి.. లేకుంటే ఛలో ఢిల్లీ

కాప్రా, పెన్ పవర్, నవంబర్ 11:

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డిని బుధవారం హైదరాబాద్‌లో దళిత జన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బొజ్జ యాదగిరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా దళిత, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

డిసెంబర్‌ 6న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా ముంబైలోని ఆయన సమాధి వద్ద నివాళులర్పించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఉచిత రైలు ప్రయాణ సౌకర్యం కల్పించాలని జాతీయ అంబేద్కర్‌ అవార్డు గ్రహీత బత్తుల చంద్రమౌళి కోరారు.

అలాగే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుపేద దళిత కుటుంబాలకు పీఎంజీపీ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించాలని, బ్యాంకుల నుంచి రుణాలు పొందడంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించి, ఎలాంటి అనవసర జాప్యం లేకుండా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్‌దాస్‌ అథవాలే ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

అర్హులైన దళిత కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందకపోతే దళిత సంఘాల ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని నాయకులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో దళిత సంఘాల జేఏసీ జాతీయ నాయకులు బత్తుల చంద్రమౌళి, బొజ్జ యాదగిరి, శ్రీనివాసరాజు, బీసీ సంఘం నాయకుడు కుమార్‌ గౌడ్‌, దళిత నాయకులు ఈ. యాదగిరి, బి. రాకేష్‌, ఈ.కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular