విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక
నాచారంలో రేపు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ
వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి
కాప్రా, పెన్ పవర్, నవంబర్ 11:
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్ పి డీసీల్ ) ఆధ్వర్యంలో ఈనెల 13వ తేదీన ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు హబ్సిగూడ ఆపరేషన్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కె.శ్రీనివాస్ తెలిపారు.
నాచారం 33/11 కేవీ సబ్‌స్టేషన్ ఎదురుగా ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా బిల్డింగ్‌లో ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సమావేశం జరుగనుంది. ఈ కార్యక్రమానికి వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక (సిజిఆర్ఎఫ్) చైర్‌పర్సన్‌తో పాటు మెంబర్ టెక్నికల్, మెంబర్ ఫైనాన్స్, మెంబర్ కన్స్యూమర్ అఫైర్స్ అధికారులు హాజరుకానున్నారు.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న విద్యుత్ సమస్యలు, విద్యుత్ బిల్లుల్లో హెచ్చుతగ్గులు, ఇతర సమస్యలపై వినియోగదారులు నేరుగా ఫిర్యాదు చేసి పరిష్కారం పొందవచ్చని అధికారులు సూచించారు.ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కె. శ్రీనివాస్ కోరారు.
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక
నాచారంలో రేపు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ
వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి
కాప్రా పెన్ పవర్,నవంబర్ 11:
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్ పి డీసీల్ ) ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు హబ్సిగూడ ఆపరేషన్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కె. శ్రీనివాస్ తెలిపారు.
నాచారం 33/11 కేవీ సబ్‌స్టేషన్ ఎదురుగా ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా బిల్డింగ్‌లో ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సమావేశం జరుగనుంది. ఈ కార్యక్రమానికి వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక (సిజిఆర్ఎఫ్) చైర్‌పర్సన్‌తో పాటు మెంబర్ టెక్నికల్, మెంబర్ ఫైనాన్స్, మెంబర్ కన్స్యూమర్ అఫైర్స్ అధికారులు హాజరుకానున్నారు.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న విద్యుత్ సమస్యలు, విద్యుత్ బిల్లుల్లో హెచ్చుతగ్గులు, ఇతర సమస్యలపై వినియోగదారులు నేరుగా ఫిర్యాదు చేసి పరిష్కారం పొందవచ్చని అధికారులు సూచించారు.ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ కె. శ్రీనివాస్ కోరారు.

