గూడెంకొత్తవీధి, నవంబర్ 11 (పెన్ పవర్):వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ పదవిపై ఇతర పార్టీ నాయకులు వ్యాఖ్యలు చేయడం, జోక్యం చేసుకోవడం అనవసరమని వైసీపీ గూడెంకొత్తవీధి మండల శ్రేణులు పేర్కొన్నాయి. ఎంపీపీ ఎంపికపై నిర్ణయం తీసుకునే హక్కు తమ పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు మాత్రమే ఉందని స్పష్టం చేశాయి. ఇతర పార్టీల నాయకులు తమ పార్టీ బలోపేతం, మండల అభివృద్ధి, గిరిజన ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించాయి. సామాజిక వర్గాల పేరుతో రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని, వైసీపీలో అన్ని కులాలు, మతాల వారికి స్థానం ఉందని తెలిపాయి. పార్టీ ఐక్యత, కార్యకర్తల అభిప్రాయాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ఎంపీపీ ఎంపిక ఉంటుందని వెల్లడించాయి.ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా కోశాధికారి కుందరి రామకృష్ణ, మండల ఉపాధ్యక్షుడు వంతల అరుణ్, కొర్ర నూకరాజు, ఎంపీటీసీ జగత్ రాయ్, కృపారావు, ఎస్కే మజీద్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎంపీపీ ఎంపిక మా పార్టీ అంతర్గత విషయం:ఇతర పార్టీల జోక్యం అనవసరం
RELATED ARTICLES

