వేటపాలెం : చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాములు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీరాల నియోజకవర్గ పరిధిలో మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరినీ ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి పార్లమెంట్ కమిటీ సమన్వయకర్త, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్, పార్లమెంట్ సమన్వయకర్త లక్ష్మీ కళ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చీరాల అసెంబ్లీ స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ సమన్వయకర్తలు ఆమంచి రాజేంద్రప్రసాద్, కడలి లక్ష్మణ కృష్ణ కుమార్, గాంధీ శేషగిరిరావు అధ్యక్షత వహించారు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాములు, నియోజకవర్గ సమన్వయకర్తలు స్థానిక ఎన్నికల్లో పార్టీ అనుసరించిన విధానాలు, ఎదురైన సవాళ్లు, సమస్యలపై సమీక్షించారు. భవిష్యత్తులో చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత పటిష్టం చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై స్థానిక నాయకులు, జనసైనికులు, వీర మహిళలకు పలు సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థులు, జనసైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

