Homeఆంధ్రప్రదేశ్బాపట్లతండ్రి జ్ఞాపకార్థం వాటర్ ట్యాంక్ నిర్మాణం.. కటారి శ్రీను సేవాభావం

తండ్రి జ్ఞాపకార్థం వాటర్ ట్యాంక్ నిర్మాణం.. కటారి శ్రీను సేవాభావం

సొంత నిధులతో గ్రామ ప్రజలకు తాగునీటి సౌకర్యం

వేటపాలెం, నవంబర్ 27 :

గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తొలగించాలనే సంకల్పంతో కటారిపాలెంకు చెందిన కటారి శ్రీను ముందుకొచ్చి తన సేవా నిరతిని చాటుకున్నారు. వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని పొట్టి సుబ్బయ్యపాలెంలో తన సొంత నిధులతో వాటర్ ట్యాంక్ నిర్మించి గ్రామస్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

తన తండ్రి కటారి సమాధి జ్ఞాపకార్థంగా ఈ నిర్మాణాన్ని చేపట్టడం విశేషం. నిర్మాణ పనులు పూర్తవడంతో శుక్రవారం కొబ్బరికాయ కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించి వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కటారి శ్రీను మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. గ్రామంలో ఏ అవసరం వచ్చినా తనకు సాధ్యమైనంత సహాయం చేసేందుకు ముందుంటానని పేర్కొన్నారు.

తాగునీటి అవసరాలను గుర్తించి సొంత ఖర్చులతో వాటర్ ట్యాంక్ నిర్మించి అందించడం పట్ల గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. కటారి శ్రీను సేవా దృక్పథాన్ని అభినందిస్తూ, ఈ సదుపాయం గ్రామ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular