ePaper
Saturday, May 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజునేటి నుంచి శ్రీశ్రీ దారాలమ్మ తల్లి జాతర..! వేలాదిగా తరలిరానున్న భక్తులు..

నేటి నుంచి శ్రీశ్రీ దారాలమ్మ తల్లి జాతర..! వేలాదిగా తరలిరానున్న భక్తులు..

📰 Generate e-Paper Clip

 

భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు.

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 16: అంతర్రాష్ట్ర ఆరాధ్య దైవం శ్రీశ్రీ దారాలమ్మతల్లి 60వ జాతరమహోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి.అమ్మవారి జాతర కోసం ఈఓ సాంబశివరావు ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ సభ్యులు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రతి ఏటా దారకొండ నుంచి అమ్మవారి ప్రధాన పండుగ రోజు అమ్మవారి ఘటాలను స్థానిక మహిళా భక్తులు ఊరేగింపుగా తీసుకువెళ్లడం ఆనవాయితీ.ఈనెల 18 బుధవారం అమ్మవారి ప్రధాన పండుగ కావడంతో మహిళా భక్తులు ఘటాల ఊరేగింపుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ పండుగ 3 రోజులు తుని పట్టణానికి చెందిన దారాలమ్మ తల్లి భక్తుడు చిన్న దంపతుల ఆధ్వర్యంలో జాతరకు వచ్చిన భక్తులకు ఉచిత అన్నదానం చేస్తున్నట్టు ఈఓ తెలిపారు. భక్తులందరూ అమ్మవారి పండుగలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఈఓ సాంబశివరావు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular