ePaper
Friday, March 20, 2026
spot_img
ePaper
Homeఆంధ్రప్రదేశ్నవోదయలో సిద్ధార్థ విద్యార్థుల జయఢంకా...

నవోదయలో సిద్ధార్థ విద్యార్థుల జయఢంకా…

📰 Generate e-Paper Clip

ముగ్గురు విద్యార్థులు ఎంపిక – పాఠశాల ప్రతిష్టను పెంచిన ప్రతిభ

 

పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 18

పుల్లలచెరువు మండలం ముటుకులలోని సిద్ధార్థ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు జవహర్ నవోదయ విద్యాలయం ప్రవేశ పరీక్షల్లో మెరిసి పాఠశాల ప్రతిష్టను మరింత పెంచారు.2026–27 విద్యా సంవత్సరానికి నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ముద్ద అవినాష్, ఎం. మాధవి, టి. సంతోష్ రెడ్డి ఎంపికై తమ ప్రతిభను చాటుకున్నారు.సోమవారం విడుదలైన ఫలితాల్లో ఈ ముగ్గురు విద్యార్థులు ప్రవేశానికి అర్హత సాధించడం పాఠశాలలో ఆనందోత్సాహాలను నింపింది.డిసెంబర్‌లో జరిగిన ఈ ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్థులు క్రమశిక్షణతో చదివి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో కృషి చేసి మంచి మార్కులు సాధించి విజయాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మానుకొండ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, “విద్యార్థుల పట్టుదల, ఉపాధ్యాయుల అంకితభావం కలిసి వచ్చిన ఫలితమే ఇది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా సరైన మార్గదర్శకత్వం ఉంటే పెద్ద విజయాలు సాధించగలరని మా విద్యార్థులు నిరూపించారు అని తెలిపారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు కూడా విద్యార్థుల విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.నవోదయ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో ప్రవేశం సాధించడం ద్వారా ఈ విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది పడిందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular