Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజులకవరపుపేటలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ! ముగ్గురికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం

లకవరపుపేటలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ! ముగ్గురికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 22:గూడెంకొత్తవీధి మండలంలోని లక్కవరపుపేట గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు. స్థానికులు అందించిన వివరాల మేరకు.. లకవరపుపేట పంచాయతీ కొడిసింగి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై పెదవలస వైపు వెళుతుండగా అదే పంచాయతీలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు మరో ద్విచక్ర వాహనంతో ఎదురుగా వస్తున్నారు. సచివాలయం సమీపంలోని స్మశాన వాటిక ప్రధాన రహదారిపై ఈ రెండు వాహనాలు అకస్మాత్తుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.

 

వారిని స్థానికులు పెదవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆ ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular