తక్షణ ఆర్థిక సాయం అందజేత •
చదువు, బాగోగుల బాధ్యత స్వీకరణ •
చింతపల్లి బాల సదనంలో పరామర్శ
చింతపల్లి, జూలై 7 (పెన్ పవర్):“మానవ సేవే మాధవ సేవ” అన్న మాటను కార్యరూపంలో చూపిస్తూ, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం తన పుట్టినరోజును వినూత్నంగా సేవా కార్యక్రమంగా జరుపుకున్నారు. వేడుకలకు పరిమితం కాకుండా, చింతపల్లి బాల సదనంలో ఆశ్రయం పొందుతున్న ఓ అనాథ బాలికకు అండగా నిలిచి ఆదర్శంగా నిలిచారు.జీకే వీధి మండలం దారకొండ గ్రామానికి చెందిన తల్లిదండ్రులు లేని ఓ మైనర్ బాలిక ఇటీవల ఒక ఇంటి వద్ద పని చేస్తూ యజమానుల చేతిలో తీవ్ర గాయాలకు గురైంది. ఈ అమానుష ఘటన అనంతరం బాలిక భద్రత దృష్ట్యా కుటుంబ సభ్యులు ఆమెను చింతపల్లిలోని బాల సదనానికి (చిల్డ్రన్ హోమ్) తరలించారు.బాలిక పరిస్థితిని తెలుసుకున్న ఉల్లి సీతారాం, తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానికులతో కలిసి నేరుగా బాల సదనానికి చేరుకుని ఆమెను పరామర్శించారు. చిన్నారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ, నూతన వస్త్రాలతో పాటు రూ.5,000 నగదును తక్షణ ఆర్థిక సాయంగా అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలిక బాగోగులు, కనీస అవసరాలు మరియు విద్యాభ్యాసానికి అవసరమైన అన్ని సదుపాయాలను ఇకపై తానే స్వయంగా కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆమె చదువుకు ఎల్లవేళలా అండగా ఉంటానని, భవిష్యత్తుకు ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటానని సభాముఖంగా ప్రకటించారు. “నాయకత్వం అంటే కేవలం రాజకీయాలు చేయడం మాత్రమే కాదు; కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడం నిజమైన నాయకత్వ లక్షణం” అని ఉల్లి సీతారాం పేర్కొన్నారు. ఆయన తీసుకున్న ఈ సామాజిక బాధ్యతా నిర్ణయాన్ని స్థానికులు, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది మరియు జనసేన పార్టీ కార్యకర్తలు అభినందించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఉగ్రంగి లక్ష్మణ్ రావు, చింతపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కిముడు కృష్ణమూర్తి, చింతపల్లి జనసేన ప్రధాన కార్యదర్శి వనబరింగి సాయిరామ్, గూడెం జనసేన మండల అధ్యక్షుడు కొయ్యం బాలరాజు, కొత్తపాలెం అధ్యక్షులు మఠం శ్రీనివాస్, నాయకులు కూడ అబ్బాయిదొర, పొటుకూరి అబ్బాయిదొర, రాచకుట్ల వినోద్, ఐటీ ఇన్చార్జ్ సాగిన వెంకటేశ్వర్లు, జనసేన నాయకుడు లోచల రమేష్, బోనంగి విజయ్, గబులంగి గణేష్, అరడ కోటేశ్వరరావు, గడుతూరి రమణ, బొర్ర నూకరాజు, అలాగే బీజేపీ నాయకులు పొటుకూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

