Homeఆంధ్రప్రదేశ్కాకినాడతణుకువాడలో ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

తణుకువాడలో ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

కాజులూరు, పెన్ పవర్, జూలై 8: కాజులూరు మండల పరిధిలోని తణుకువాడ గ్రామంలో దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను బుధవారం వైఎస్సార్‌సీపీ నాయకులు,మాజీ సర్పంచ్ నరాల సుబ్బరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమాను లతో కలిసి జయంతి వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ నరాల సుబ్బరాజు, శలపాక ఎంపీటీసీ దడాల రమేష్ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా సంక్షేమానికి విశేష సేవలు అందించారని కొనియాడారు.ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల మన్ననలు పొందాయని,వాటిని ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.అనంతరం వైఎస్సార్‌సీపీ నాయకుడు, ప్రముఖ క్యాటరింగ్ ప్రొప్రైటర్ కుక్కల బాబు మాట్లాడుతూ రైతు సంక్షేమం, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన కృషి రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు.ప్రజా సంక్షేమం కోసం ఆయన చూపిన మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూరంపూడి భాను,అనుసూరి మహా లక్ష్మి,పితాని నాగు, పితాని భీమేశ్వర రావు,గండి శ్రీను,దడాల అనీల్, లక్ష్మణరావు,గొల్లపల్లి వెంకటేష్ బాబు,నాగు,మట్టా ,నాగేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular