Homeఆంధ్రప్రదేశ్ఎస్‌ఐఆర్ సర్వేలో ఒక్క ఓటరూ మిస్ కాకూడదు- బీఎల్‌ఓలకు బీఎల్‌ఏలు సహకరించాలి: బొబ్బిలి లక్ష్మణ్

ఎస్‌ఐఆర్ సర్వేలో ఒక్క ఓటరూ మిస్ కాకూడదు- బీఎల్‌ఓలకు బీఎల్‌ఏలు సహకరించాలి: బొబ్బిలి లక్ష్మణ్

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై 7:ప్రత్యేక ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాలు ప్రతి ఓటరికి అందేలా బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు)కు వైఎస్సార్‌సీపీ నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) పూర్తి సహకారం అందించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్ కోరారు. మంగళవారం గూడెం కొత్తవీధి మండలంలో ఆయన మాట్లాడుతూ, మండలంలో మొత్తం 56 పోలింగ్ బూత్‌లు ఉండగా, అన్ని బూత్‌లకు పార్టీ తరఫున బీఎల్‌ఏలను నియమించామని తెలిపారు. ప్రతి బీఎల్‌ఏ తన పరిధిలోని బీఎల్‌ఓతో సమన్వయం చేసుకుని ఎన్యుమరేషన్ ఫారాలు ప్రతి ఓటరికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.కొన్ని ప్రాంతాల్లో ఒక పంచాయతీ లేదా బూత్‌కు చెందిన ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాలు పొరపాటున వేరే పంచాయతీ లేదా బూత్ పరిధిలోకి వెళ్లడంతో చాలామంది ఓటర్లకు ఫారాలు అందలేదని ఆయన పేర్కొన్నారు. అలాంటి సందర్భాల్లో సంబంధిత బీఎల్‌ఏలు బాధ్యత తీసుకుని, వేరే బూత్‌లలో ఉన్న ఫారాలను సేకరించి ఆయా ఓటర్లను స్వయంగా కలిసి వివరాలు నమోదు చేయించి, తిరిగి సంబంధిత బీఎల్‌ఓలకు అందజేయాలని సూచించారు.పొరపాట్ల కారణంగా ఫారాలు అందకపోతే కొందరు ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన బొబ్బిలి లక్ష్మణ్, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా పార్టీ నాయకులు, బూత్ ఏజెంట్లు, బీఎల్‌ఓలు సమన్వయంతో పనిచేసి ప్రతి అర్హుడి ఓటు నమోదు అయ్యేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular