స్టాఫ్ రిపోర్టర్ పాడేరు/ గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై 7:భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంతి టి. సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అమరావతి నుంచి అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కడప, కర్నూలు, ఎన్టీఆర్ తదితర జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి, ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాల్సిన విధానాలపై పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ నిశాంతి టి. ఆధ్వర్యంలో తహసీల్దార్లు, ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్‌వోలు), మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీవోలు), బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు)తో పాటు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సంబంధిత అధికారులు, సిబ్బందికి ప్రత్యేక ఆన్‌లైన్ శిక్షణ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను బాధ్యతాయుతంగా, పారదర్శకంగా, ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఫారాన్ని జాగ్రత్తగా పరిశీలించి డేటా నమోదు చేయాలని, ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించేందుకు డిజిటలైజేషన్ కీలకమని ఆమె పేర్కొన్నారు.
ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి:జిల్లా కలెక్టర్ టి.నిశాంతి
RELATED ARTICLES

