ePaper
Wednesday, March 25, 2026
spot_img
ePaper
Homeఆంధ్రప్రదేశ్పల్నాడునాయకుడిపై ప్రజల విశ్వాసం.. నమ్మకమే వారి భవిష్యత్ ను నిర్ణయిస్తాయి : ప్రత్తిపాటి

నాయకుడిపై ప్రజల విశ్వాసం.. నమ్మకమే వారి భవిష్యత్ ను నిర్ణయిస్తాయి : ప్రత్తిపాటి

📰 Generate e-Paper Clip

  • వైసీపీని గెలిపిస్తే ప్రజలకు సక్రమంగా తాగునీరు కూడా అందలేదు.
  • టీడీపీ హాయాంలో రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తే.. వైసీపీ చిన్న గుంత పూడ్చలేదు.
  • కొత్తవారిని నమ్మినందునే చిలకలూరిపేట అభివృద్ధిలో వెనుకబడింది.
  • అభివృద్ధిలో మార్పుకోరుకోవాలని కానీ.. నాయకత్వంలో కాదు.
  • ఎన్నికలు వచ్చేవరకూ కౌన్సిలర్లు మాజీలు కారు.
  • మాజీ కౌన్సిలర్ల సన్మాన సభలో మాజీమంత్రి ప్రత్తిపాటి.

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 25:

చిలకలూరిపేట : ఒక నాయకుడిపై ప్రజలు పెట్టుకునే నమ్మకం, విశ్వాసమే వారి భవిష్యత్ ను నిర్ణయిస్తాయని, దానికి ప్రత్యక్ష ఉదాహరణ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన బాటలో నడిచే ప్రజాప్రతినిధులేనని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు.
బుధవారం చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్ లో మున్సిపాలిటీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన మాజీ చైర్మన్, టీడీపీ 18 మంది మాజీ కౌన్సిలర్ల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పదవీ కాలం ముగించుకున్న చైర్మన్, కౌన్సిలర్లతో పాటు, మున్సిపల్ అధికారుల్ని, పట్టణ ప్రముఖులను, మున్సిపల్ సిబ్బందిని సన్మానించిన ప్రత్తిపాటి, అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు.

అభివృద్ధిలో మార్పు కోరుకోవాలి కానీ..నాయకత్వంలో కాదు

చిలకలూరిపేట పట్టణ ప్రజలు అభివృద్ధిలో మార్పు కోరుకోవాలి కానీ, నాయకత్వంలో కాదని, గతంలో చేసిన తప్పు చేయకుండా ఉంటేనే పట్టణప్రజల స్థితిగతులు పూర్తిగా మారిపోతాయని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. 2014-19 మధ్యకాలంలో నియోజకవర్గంలో రూ.4వేలకోట్లకు పైగా అభివృద్ధి పనులు చేసినా ప్రజలు కొత్తవారికి అవకాశమిచ్చి తప్పుచేశారని, దానివల్లే నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకండిందని ఆయన చెప్పారు. ప్రజాసమస్యల గురించి.. నియోజకవర్గం గురించి ఏమీ తెలియనివారిని నమ్మడం, వారిని చేరదీయడం వంటి తప్పులు చేయొద్దని ఈ సందర్భంగా ప్రత్తిపాటి నియోజకవర్గ ప్రజలకు హితవు పలికారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలోనే పట్టణంలో ఎక్కడా మట్టిరోడ్డు అనేది లేకుండా మొత్తం సిమెంట్ రోడ్లు వేయించి, డ్రైనేజ్ లు నిర్మించి, తాగునీరు నిరంతరం అందిచామన్నారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎక్కడా చిన్న గుంత కూడా పూడ్చకుండా ఐదేళ్లు ప్రజల్ని, వారి సమస్యల్ని గాలికి వదిలేసిందన్నారు. చివరకు టీడీపీ ప్రభుత్వంలో రోజూ నీటిసరఫరా చేస్తే. వైసీపీ నాయకులు రెండ్రోజులకు ఒకసారి నీరందించారన్నారు. వారి హాయాంలో జరిగినస్థానిక ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగాయని, గెలుపుకోసం దుర్మార్గాలకు పాల్పడ్డారని ప్రత్తిపాటి చెప్పారు. వైసీపీ దుర్మార్గ పాలనలో ఎన్నో చేదు అనుభవాలను చవిచూసిన ప్రజలు మున్ముందు అప్రమత్తంగా వ్యవహరించాలని, అప్పుడే వారిజీవితాలకు, నియోజకవర్గానికి ఎనలేని మేలు కలుగుతుందని ప్రత్తిపాటి తెలిపారు. గత ప్రభుత్వ దుర్మార్గాలను ఎదిరించడంలో నాడు టీడీపీ నుంచి గెలుపొందిన కౌన్సిలర్లు ముందు నిలిచారని, ధైర్యంగా వైసీపీ ప్రభుత్వ దోపిడీపై పోరాడారని ప్రత్తిపాటి ప్రశంసించారు. మరలా స్థానిక ఎన్నికలు జరిగేవరకు ఈ కౌన్సిలర్లు యథావిథిగా ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారు అప్పటివరకు మాజీలు కారని ఆయన తెలిపారు

కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫాని, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తేళ్ల సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, అసిస్ట్ సంస్థ డైరెక్టర్ జాస్టి రంగారావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షులు బత్తినేని శ్రీనివాసరావు, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, పోట్రూ పూర్ణచంద్రరావు, క్లస్టర్ ఇంచార్జీలు మద్దిబోయిన శివ , ముల్లా కరీముల్లా, షేక్ మస్తాన్ వలి, కొత్త కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు మురకొండ మల్లిబాబు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, డిఇ అబ్దుల్ రహీమ్, కరెంట్ ఏ.డి.ఈ అశోక్ కుమార్, మాజీ రెవెన్యూ అధికారి చల్లా విజయ్ కుమార్, డాక్టర్లు ముద్దన రమేష్, కొల్లా అమర్, కందిమల్ల వాసుదేవ అంకమ్మ చౌదరి , చిగురుపాటి రామారావు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ వివరాలు

పేరు: SRIKANTH NARASIMHALA
హోదా: STAFF REPORTER
ప్రాంతం: CHILAKALURI PETA, PALNADU DIST
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular