చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 26 :
చిలకలూరిపేట: మార్కాపురం ప్రాంతంలో జరిగిన హరికృష్ణ ట్రావెల్స్ బస్సు మరియు కంకర లోడ్ తో వస్తున్న టిప్పర్ మూల మలుపు వద్ద ఢీ కొట్టిన దుర్ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమై 13 మంది గా పైగా మరణించగా, 25 మంది పైగా క్షతగాత్రులైనారు అని ఈ సంఘటనలో బాధ్యులెవరు అని ప్రభుత్వాన్ని నిలదీశారు. 12 సంవత్సరాల క్రితం, పాలెం బస్సు దహనం దుర్ఘటనలో 45 మంది యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మృతి చెందిన సంఘటన దగ్గర నుండి ఈ ప్రమాదాల పరంపర కొనసాగుతూనే ఉన్నా అధికారులు కంటి తుడుపు చర్యలు తీసుకుంటున్నారు అని పరమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోలేకపోవడం చాలా విచారకరమని అన్నారు. ఈరోజు మార్కాపురం ప్రాంతంలో జరిగిన బస్సు యాక్సిడెంట్ కు మలో మలుపు డిజైన్లు లోపం ఉన్నట్లుగా అక్కడి ప్రజాప్రతినిధులే చెప్పడం విచారకరం అని ఇప్పటికైనా ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని భాను ప్రసాద్ కోరారు.


