ePaper
Saturday, March 28, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్గంగవరంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్

గంగవరంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్

📰 Generate e-Paper Clip

 

గంగవరం, పెన్ పవర్, మార్చ్ 28:

పోలవరం జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన దినేష్ కుమార్ శనివారం గంగవరంలో విస్తృతంగా పర్యటించారు. జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే గంగవరంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల ను సందర్శించి అభివృద్ధిపై అధికారులకు దిశా నిర్దేశించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి గిరిజనులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వెలుగు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫ్యాక్టరీని సందర్శించారు. అలాగే గంగవరం గ్రామ సచివాలయాన్ని సందర్శించారు.

 

 

అనంతరం స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలురు ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఆయన వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి స్మరణ్ రాజ్, తాసిల్దార్ శ్రీనివాస్ ఎంపీడీవో లక్ష్మణరావు సర్పంచ్ కలుముల అక్కమ్మ తదితరులున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular