Homeఆంధ్రప్రదేశ్కాకినాడకోలంకలో భారీ అగ్నిప్రమాదం.. రైస్ మిల్లు, పీచు ఫ్యాక్టరీ దగ్ధం

కోలంకలో భారీ అగ్నిప్రమాదం.. రైస్ మిల్లు, పీచు ఫ్యాక్టరీ దగ్ధం

కాజులూరు, పెన్ పవర్,నవంబర్‌ 11: కాజులూరు మండలం కోలంక గ్రామంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక మాజీ ఎంపీటీసీ, మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ తొగరు చంద్రశేఖర్‌బాబుకు చెందిన రైస్‌మిల్లులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు పక్కనే ఉన్న పీచు ఫ్యాక్టరీకి వ్యాపించడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో రైస్‌మిల్లులో బియ్యం ఆడించేందుకు సిద్ధంగా ఉంచిన సుమారు 500 ధాన్యం బస్తాలు, పీచు ఫ్యాక్టరీలోని ముడిసరుకు, ఎగుమతికి సిద్ధంగా ఉంచిన పీచు సామగ్రి, సుమారు 1,300 పీచు బేళ్లు, ఎలివేటర్‌, మోటార్లు, గోడౌన్లు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న కాకినాడ అగ్నిమాపక సిబ్బంది ఫైర్‌ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఫైర్‌ అధికారి వి. సుబ్బారావు ఆధ్వర్యంలో సిబ్బంది సమర్థవంతంగా పనిచేసి మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అడ్డుకున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.35 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు యజమాని చంద్రశేఖర్‌బాబు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular