ePaper
Tuesday, March 31, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్ఘోర రోడ్డు ప్రమాదం

ఘోర రోడ్డు ప్రమాదం

📰 Generate e-Paper Clip

చింతూరు పెన్ పవర్ మార్చి 29:

చింతూరు మండలంలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 30వ నెంబర్ జాతీయ రహదారిపై బొడ్డుగూడెం సమీపంలో బొలెరో వాహనం కల్వర్ట్‌ను ఢీకొని లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వాహనంలో మొత్తం 13 మంది ఉన్నట్టు సమాచారం. గాయపడిన వారిని చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular