Homeతెలంగాణహైడ్రా చర్యలకు అడ్డుపడిన.. దంపతులపై కేసు నమోదు..

హైడ్రా చర్యలకు అడ్డుపడిన.. దంపతులపై కేసు నమోదు..

 

  • గండిమైసమ్మ–మియాపూర్ 150 ఫీట్ల రోడ్డు ఆక్రమణలపై హైడ్రా చర్యలు.
  • దుండిగల్ సర్కిల్ పరిధిలో క్రమ కట్టడాలను మంగళవారం హైడ్రా కూల్చివేతలు..
  • కూల్చివేతల్లో విధులకు ఆటంకం..! బాల్‌రెడ్డి,అతని భార్యపై ఫిర్యాదు..
  • బిఎన్ఎస్ 221, 126 సెక్షన్ల కింద కేసు నమోదు దర్యాప్తు చేపట్టిన పోలీసులు..

దుండిగల్‌, పెన్ పవర్, ఏప్రిల్ 1:

ఆక్రమణలపై మాత్రమే కాదు, ప్రభుత్వ చర్యలకు అడ్డం వచ్చిన వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని హైడ్రా అధికారులు హెచ్చరించారు..హైడ్రా విధులకు ఆటంకం కలిగించారని ఓ దంపతులపై రెండు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొన్న మంగళవారం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గండిమైసమ్మ నుండి మియాపూర్ వెళ్లే 150 అడుగుల దారిలో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు తొలగించారు..ఈ చర్యలు చేపడుతున్న సమయంలో విధులకు ఆటంకం కలిగించిన బౌరంపేట్ గ్రామానికి చెందిన పలుపునూరి బాల్‌రెడ్డి , అతని భార్యపై హైడ్రా ఇన్‌స్పెక్టర్  మల్లేశ్వర్ ఫిర్యాదు చేశారు. దీంతో దుండిగల్ పోలీసులు బాల్‌రెడ్డి దంపతులపై బిఎన్ఎస్ సెక్షన్ 221, 126 ప్రకారం కేసును నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular