ePaper
Thursday, April 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుగిరిజనులకు తప్పని డోలి కష్టాలు

గిరిజనులకు తప్పని డోలి కష్టాలు

పురిటి నొప్పులతో విలవిలలాడుతున్న గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేక భర్త, కుటుంబ సభ్యులు ఐదు కిలోమీటర్ల మేర డోలిలో మోసుకెళ్లాల్సి వచ్చిన ఘటన అల్లూరి ఏజెన్సీ ప్రాంతాల దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది.

  • పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు డోలి ప్రయాణం
  • రోడ్డు సౌకర్యం లేక 5 కిలోమీటర్లు మోసిన కుటుంబ సభ్యులు
  • డొక్రిపాడు గిరిజనుల ఆగ్రహం – అభివృద్ధి ఎక్కడ?
  • అత్యవసర వైద్యం కోసం ప్రాణాలతో పోరాటం
  • ఏజెన్సీ గ్రామాల్లో ఇంకా మారని దుస్థితి

అల్లూరి, పెన్ పవర్ ఏప్రిల్ 2:

ఏజెన్సీ గిరిజనులకు డోలి కష్థాలు తప్పడంలేదు. అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం డొక్రిపాడులో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పురిటి నొప్పులతో బాధపడుతున్న భార్యను రోడ్డు సౌకర్యం లేక భర్త, కుటుంబ సభ్యులు కలిసి 5 కిలోమీటర్ల మేర డోలిలో మోసుకెళ్లారు. రోడ్డు సౌకర్యం లేక కష్టాలు తప్పడం లేదని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వాల మధ్య, కనీస రహదారి లేక గిరిజనులు ఇప్పటికీ ప్రాణాలతో పోరాడాల్సి వస్తోందని డొక్రిపాడు వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular