Homeఆంధ్రప్రదేశ్పోలవరంసిరిగిందలపాడులో జూలై 12న ఉచిత వైద్య శిబిరం

సిరిగిందలపాడులో జూలై 12న ఉచిత వైద్య శిబిరం

 

రంపచోడవరం, పెన్ పవర్, జూలై 9: రామకృష్ణ మిషన్, రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో ఈ నెల 12న రంపచోడవరం మండలం సిరిగిందలపాడులోని రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాలలో ఉచిత ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు స్వామి పరిజ్ఞేయానంద మహారాజ్ తెలిపారు. సాధారణ, గుండె, బీపీ, షుగర్, మూర్ఛ వ్యాధులతో పాటు కంటి పరీక్షలు నిర్వహించి ఉచిత కళ్లజోళ్లు, శుక్లం శస్త్రచికిత్సలు, నాలుగు నెలలకు సరిపడా మందులు అందజేయనున్నట్లు తెలిపారు. రోగులు ఆధార్, తెల్ల రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులతో హాజరుకావాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular