ePaper
Saturday, April 4, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లిటీటీడీ చైర్మన్ ను వెంటనే తొలగించాలి

టీటీడీ చైర్మన్ ను వెంటనే తొలగించాలి

టీటీడీ చైర్మన్ ను వెంటనే తొలగించాలి


-నర్సీపట్నంలో వైసిపి నాయకుల ఆందోళన

నర్సీపట్నం పెన్ పవర్ :

టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడును వెంటనే ఆ పదవి నుండి తొలగించాలని రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. పార్టీ అధిష్టానం పిలుపుమేరకు నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. స్థానిక వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తమ పార్టీ నాయకులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ పవిత్రత నిలబడేలా చూడాలని ఆ భగవంతునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం బయట టిటిడి చైర్మన్ కు వ్యతిరేకంగా ప్లే కార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గణేష్ మీడియాతో మాట్లాడుతూ టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అశ్లీలంగా వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నా, ముఖ్యమంత్రి మౌనంగా ఉండడం దారుణమన్నారు. టీటీడీ పవిత్రత కాపాడేలా అతన్ని చైర్మన్ పదవి నుంచి తొలగించాలన్నారు. బి.ఆర్. నాయుడు పదవి చేపట్టిన నాటినుండి తిరుమలలో అన్ని అపశకునాలే జరుగుతున్నాయన్నారు. ప్రతిదీ వివాదాస్పదం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి సీనియర్ నాయకుడు చింతకాయల సన్యాసిపాత్రుడు, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఏకా శివప్రసాద్, సుర్ల గిరిబాబు, కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు మరియు మాజీ కౌన్సిలర్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular