కాజులూరు, పెన్ పవర్ జూలై 6: ఐసీడీఎస్ తాళ్లరేవు ప్రాజెక్టు పరిధిలోని గొల్లపాలెం సెక్టార్, ఆర్యావటం గ్రామ అంగన్వాడీ కేంద్రం-104లో టీచర్‌గా సేవలందించి పదవీ విరమణ పొందిన నాగమణి దంపతులను సోమవారం ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా గొల్లపాలెం సెక్టార్‌కు చెందిన అంగన్వాడీ టీచర్లు నాగమణి అందించిన సేవలను కొనియాడుతూ శాలువా కప్పి, జ్ఞాపిక అందించి ఘనంగా సన్మానించారు. ఆమె పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు వరలక్ష్మి,అరుణ,పుష్ప తదితరులు పాల్గొని నాగమణి దంపతులకు అభినందనలు తెలియజేశారు.

