ePaper
Wednesday, May 20, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ఖేలో ఇండియా ట్రైబల్ ఫుట్ బాల్ లో మెరిసిన గిరిజన కుసుమాలు

ఖేలో ఇండియా ట్రైబల్ ఫుట్ బాల్ లో మెరిసిన గిరిజన కుసుమాలు

📰 Generate e-Paper Clip

 

వై రామవరం/ గుర్తేడు, పెన్ పవర్, ఏప్రిల్ 4 : ఆల్ ఇండియా లెవెల్ లో ఖేలో ఇండియా ట్రైబల్ ఫుట్ బాల్ లో గిరిజన విద్యార్థినిలు సత్తా చాటారని ఫిజికల్ డైరెక్టర్ ఆర్ కొండబాబు తెలిపారు.
గుర్తేడు మండలం దార గడ్డ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల గిరిజన విద్యార్థినులు వెలుగూరి విజయ, కొర్ర పరిమిల జాతీయస్థాయిలో ఎంపిక కావడం గర్వకారణం అని అన్నారు. మార్చి 26వ తేదీ నుండి ఏప్రియల్ మూడవ తేదీ వరకు రాయపూర్,చత్తీస్గడ్ లలో జరిగినటువంటి ఖేలో ఇండియా ట్రైబల్ నేషనల్ ఫుట్బాల్ గేమ్స్ లో వీరు పాల్గొనడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి దేవి మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయికి గిరిజన విద్యార్థినులు ఎదగడం గర్వకారణం అని అన్నారు. రాబోయే జాతీయ స్థాయి పోటీలలో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించాలని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. జాతీయస్థాయిలో గిరిజన విద్యార్థినులు ఎంపిక కావడం పట్ల పలువురు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. ఫిజికల్ డైరెక్టర్ గా వ్యవహరించిన రోలుపల్లి కొండబాబు, గబుడు చంద్రశేఖర్ నాయుడు, తోటి విద్యార్థులు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular