ePaper
Thursday, May 21, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్నేర ప్రవృత్తిని విడనాడి సమాజంలో మంచి పౌరులుగా జీవించాలి

నేర ప్రవృత్తిని విడనాడి సమాజంలో మంచి పౌరులుగా జీవించాలి

📰 Generate e-Paper Clip

  • రౌడీ షీటర్లు మరియు నేర చరిత్ర గల వారి కదిలికలపై నిరంతరం నిఘా
  • చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవు

చిలకలూరిపేట , పెన్ పవర్, ఏప్రిల్ 05: 

చిలకలూరిపేట : పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధులలో రౌడీషీటర్లు, నేరచరిత్ర కలవారికి పోలీస్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. రౌడీ షీట్లు కలిగిన వ్యక్తుల ప్రవర్తన,వారు నిర్వహించే పనులు వారి జీవన విధానంపై నిఘా ఉంటుందని కౌన్సిలింగ్ కు వచ్చిన వారికి పోలీసు అధికారులు తెలియజేశారు.

సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తిని మానుకొని సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని,చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని,ఎవరైనా పోలీస్ వారి సూచనలను బేఖాతరు చేసిన అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రౌడీషీటర్ లు పాత పంథా మార్చుకొని సత్ప్రవర్తనతో మెలగా లని, పంథా మార్చుకోకుండా గ్రామాలలో గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తే అట్టి వారిపై పోలీసు వారు నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular