ePaper
Monday, April 6, 2026
ePaper
Homeతెలంగాణరంగారెడ్డిగడ్డి అన్నారం మార్కెట్‌లో మామిడి కొనుగోలు విక్రయాలపై అధికారుల పరిశీలన

గడ్డి అన్నారం మార్కెట్‌లో మామిడి కొనుగోలు విక్రయాలపై అధికారుల పరిశీలన

గడ్డి అన్నారం మార్కెట్‌లో మామిడి కొనుగోలు విక్రయాలపై అధికారుల పరిశీలన

రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు : ఎ.ఎమ్.సి చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి హెచ్చరిక

ఎల్బీనగర్, పెన్ పవర్, ఏప్రిల్ 06:

బాటసింగారం పండ్ల మార్కెట్‌ను గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఎ.ఎమ్.సి) పాలకవర్గం సందర్శించింది. మామిడి పండ్ల సీజన్ నేపథ్యంలో జరుగుతున్న క్రయ విక్రయాలను అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మామిడి సీజన్‌లో రైతులు, వ్యాపారులు, వినియోగదారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. గత ఏడాది సుమారు 1.40 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి దిగుబడి నమోదు కాగా, ఈ ఏడాది ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. రైతులను అధిక కమిషన్ల పేరుతో ఇబ్బందులకు గురిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే బకాయిలు చెల్లించని వ్యాపారులపై కూడా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మామిడి పండ్ల పరిపక్వత కోసం ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ అనుమతించిన ఇతనాల్ మాత్రమే ఉపయోగించాలని అధికంగా లేదా అనుమతి లేని రసాయనాలు వాడితే లైసెన్సు రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మార్కెట్‌లో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ ప్రతి వారం పాలకవర్గం సమీక్ష చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాస్కర చారి, సభ్యులు బండి మధుసూదన్ రావు, మచ్చెందర్ రెడ్డి, గణేశ్ నాయక్, నరసింహ, రఘుపతి రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, అంజయ్య, వెంకటేశ్వర్లు గుప్తా, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్‌తో పాటు అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular