ePaper
Saturday, April 11, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పశ్చిమ గోదావరిఢిల్లీ అథ్లెటిక్స్ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో భీమవరం ఏ ఎం ఓ ఘన విజయం

ఢిల్లీ అథ్లెటిక్స్ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో భీమవరం ఏ ఎం ఓ ఘన విజయం

 

 

భీమవరం, పెన్ పవర్, ఏప్రిల్ 11: దేశ రాజధాని ఢిల్లీలోని ఈస్ట్ వినోద్ నగర్ స్పోర్ట్స్ స్టేడియంలో ఏప్రిల్ 9 నుండి 11 వరకు జరిగిన అడ్వెంచర్ నేషనల్ మాస్టర్స్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ ఓపెన్ ఛాంపియన్‌షిప్-2026లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రీడాకారుడు, భీమవరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జిల్లా ఉప మలేరియా అధికారిగా విధులు నిర్వహిస్తున్న యాతం నాగబాబు ప్రతిభ కనబరిచి పతకాల వర్షం కురిపించారు.

ఈ పోటీల్లో నాగబాబు 800 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం సాధించి బంగారు పతకం, 1500 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం సాధించి మరో బంగారు పతకం గెలుచుకున్నారు. అదేవిధంగా 400 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం సాధించి వెండి పతకం అందుకున్నారు. మొత్తంగా మూడు విభాగాల్లో పాల్గొని రెండు బంగారు, ఒక వెండి పతకం సాధించి తన ప్రతిభను చాటుకున్నారు.ఈ విజయాల ఫలితంగా 2027 మే నెలలో జపాన్‌లో జరగనున్న ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు నాగబాబు ఎంపిక కావడం విశేషం.ఇప్పటివరకు నాగబాబు సాధించిన పతకాల సంఖ్య కూడా గణనీయమే. జాతీయ స్థాయిలో 21 బంగారు, 17 వెండి, 25 కాంస్య పతకాలు సాధించి మొత్తం 63 పతకాలు గెలుచుకోగా, అంతర్జాతీయ స్థాయిలో 2 బంగారు పతకాలు సాధించారు. రాష్ట్ర స్థాయిలో మొత్తం 40 పతకాలు సాధించి మొత్తం కెరీర్‌లో 105 పతకాలు గెలుచుకున్నారు.ప్రస్తుతం భీమవరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా మలేరియా విభాగంలో జిల్లా ఉప మలేరియా అధికారిగా సేవలందిస్తున్న నాగబాబు క్రీడలలోనూ, ఉద్యోగంలోనూ సమానంగా రాణించడం ప్రశంసనీయమని సహచరులు అభినందిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular