Homeఆంధ్రప్రదేశ్ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి:జూలై 14న జిల్లా కేంద్రాల్లో ర్యాలీ 

ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి:జూలై 14న జిల్లా కేంద్రాల్లో ర్యాలీ 

ఉపాధ్యాయ సంఘాల నేతల పిలుపు  

గూడెం కొత్త వీధి,పెన్ పవర్,జూలై 12: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఫ్యాప్టో నాయకులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జూలై 14న జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహించే రాష్ట్రవ్యాప్త “రైట్ ఫర్ టీచింగ్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించడం, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించడం, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయడం, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయడం, పెండింగ్ బకాయిలన్నీ చెల్లించడం, కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడం వంటి డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కోరారు.ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటమే మార్గమని పేర్కొంటూ, జిల్లాలోని ఉపాధ్యాయులందరూ జూలై 14న జరిగే నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయ సంఘాల నేతలు కిట్లలంగి పెద్దబ్బాయి, లోసెల రామకృష్ణ, పి. సతీష్, ఆర్. వెంకటేశ్వర్లు, ముర్ల వెంకటరమణ, మొల్ల దేవుడు, వినోద్ కుమార్, వసంత్, ధారబాబు కాళేశ్వరరావు, ఎం.వి. దొర, బాలరాజు తదితర ఫ్యాప్టో నాయకులు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular