ePaper
Wednesday, May 27, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుపొర్లుబందలో వివాహ వేడుకలో పాల్గొన్న డాక్టర్ వంపూరు గంగులయ్య

పొర్లుబందలో వివాహ వేడుకలో పాల్గొన్న డాక్టర్ వంపూరు గంగులయ్య

📰 Generate e-Paper Clip

చింతపల్లి/గూడెం కొత్తవీధి, ఏప్రిల్ 11: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కొమ్మంగి పంచాయితీ పరిధిలోని పొర్లుబంద గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు రాష్ట్ర జానపద కళలు, సాంస్కృతిక సృజనాత్మక అకాడమీ చైర్మన్, జనసేన పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ వంపూరు గంగులయ్య శనివారం హాజరయ్యారు.వంతల వారి ఆహ్వానం మేరకు కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం నవదంపతులు జశ్వంత్, మేరీలను ఆశీర్వదించి వారి దాంపత్య జీవితం ఆనందం, ఐశ్వర్యం, సుఖశాంతులతో నిండిపోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొర్లె వీర వెంకట్, మాజీ ఎంపీపీ వంతల బాబురావు, జి. మాడుగుల పిఎసిఎస్ చైర్మన్ త్రిమూర్తులు, పెదబరడ పంచాయతీ అధ్యక్షుడు కూడ రామకృష్ణ, తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.పాడేరు, చింతపల్లి, జీకే వీధి ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రామ పెద్దలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని వివాహ వేడుకను సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular