గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 15:ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న జిల్లా కేంద్రాల్లో, 25న విజయవాడలో పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు యు.వి. గిరి తెలిపారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు, సీపీఎస్ రద్దు, పీఆర్‌సీ అమలు, గిరిజన సంక్షేమ, కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.ఈ నేపథ్యంలో గూడెం కొత్తవీధిలో ఉపాధ్యాయులకు కరపత్రాలు పంపిణీ చేస్తూ ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దొండ కాలేశ్వరరావు, కె. వసంత్ పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సమస్యలపై పీఆర్‌టీయూ ధర్నాకు పిలుపు
RELATED ARTICLES

