ePaper
Wednesday, April 15, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్లోకేశ్ సారథ్యంలోని తెలుగుదేశం 3.0 వెర్షన్.. భవిష్యత్ లో రాజకీయ పార్టీల నిర్మాణ తీరును మార్చే...

లోకేశ్ సారథ్యంలోని తెలుగుదేశం 3.0 వెర్షన్.. భవిష్యత్ లో రాజకీయ పార్టీల నిర్మాణ తీరును మార్చే గొప్ప క్రియేషన్ కానుంది : ప్రత్తిపాటి

📰 Generate e-Paper Clip

  • చంద్రబాబు అనుభవం దారి చూపితే.. లోకేశ్ ఆలోచనలు పార్టీలో, ప్రభుత్వంలో పారదర్శకత..వేగం పెంచుతాయి : ప్రత్తిపాటి
  • టీడీపీ నూతన కమిటీల కూర్పులో సామాజిక న్యాయం, మహిళా ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత : ప్రత్తిపాటి
  • పార్టీకి యువరక్తం ఎక్కించిన లోకేశ్…. ఆదినుంచి అండగా ఉన్న అనుభవాన్ని టీడీపీకి బలమైన ఆదరువుగా నిలిపాడు : ప్రత్తిపాటి
  • చంద్రబాబు విజన్ 2047 లక్ష్యసాధనతో పాటు.. 2029 ఎన్నికల్లో టీడీపీ భారీ విజయానికి నూతన కమిటీలు తిరుగులేని చోదకశక్తులుగా పనిచేస్తాయి : ప్రత్తిపాటి

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 15:

చిలకలూరిపేట : లోకేశ్ సారథ్యంలో అవతరించిన తెలుగుదేశం 3.0 వెర్షన్ భవిష్యత్ లో రాజకీయపార్టీల నిర్మాణ తీరును మార్చే సరికొత్త క్రియేషన్ కానుంది. చంద్రబాబు అనుభవం రాష్రానికి దారి చూపితే.. లోకేశ్ ఆలోచనలు పాలనలో, పార్టీలో పారదర్శకత, వేగం పెంచుతాయి. టీడీపీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ నారాలోకేశ్ నాయకత్వంలో పార్టీ క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతమవుతుంది. అదే సమయంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కేడర్ ను సమన్వయం చేయడం ద్వారా మున్ముందు నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి నిర్మాణంలో లోకేశ్ ప్రధాన భూమిక పోషించనున్నారు. పట్టుదల, క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయతీలకు మారుపేరైన కార్యకర్తలనే లాంచ్ పాడ్ ల అమరికతతో టీడీపీని లోకేశ్ మరింత శక్తివంతమైన పొలిటికల్ మిసైల్ గా మార్చనున్నారు. తెలుగుదేశం పార్టీ నూతన కమిటీల ఎంపికలో యువనాయకుడు, మంత్రి నారా లోకేశ్ సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతుల్యత, మహిళా ప్రాతినిధ్యానికి సముచిత ప్రాధాన్యత కల్పించారు. కార్యకర్తే అధినేత.. కష్టేఫలి అన్న మాటల్ని ఆచరణలో పెట్టడం ద్వారా.. కార్యకర్తల కష్టం.. కన్నీరు.. కఠోరశ్రమ, ప్రాణత్యాగాలకు నిజమైన గుర్తింపు కల్పించారు. కొత్త కమిటీల ఎంపిక ద్వారా… 2029 ఎన్నికల్లో తిరుగులేని విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణుల సేవల్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని యువనేత నిర్ణయించారు. నూతన కమిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రాతినిధ్యం పెంచిన లోకేశ్.. ఆయా వర్గాల సంక్షేమం. అభ్యున్నతికి టీడీపీ ఎల్లప్పుడూ కట్టుబడే ఉంటుందని స్పష్టమైన సంకేతాలిచ్చారు. యువరక్తంతో పసుపుపార్టీకి నూతన జవసత్వాలు అందించిన లోకేశ్.. ఆదినుంచి పార్టీకి అండగా ఉన్న అనుభవాన్ని, ఆలోచనల్ని పార్టీ పటిష్టత, నిర్మాణానికి బలమైన ఆదరువుగా నిలిపారు. పార్టీ కొత్త నాయకత్వం.. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో టీడీపీని రాష్ట్రంలోనే తిరుగులేని రాజకీయ శక్తిగా నిలపడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. స్థానిక ఎన్నికల్లో సాధించిన అనూహ్య విజయంతో.. పునర్విభజనతో పెరిగే శాసనసభ, పార్లమెంట్ స్థానాల్లో జరిగే 2029 ఎన్నికల్లో టీడీపీ విజయభేరి, జాతీయస్థాయిలో మారమోగాలన్నదే లోకేశ్ బలమైన ఆకాంక్ష. అదేవిధంగా అధినాయకుడు, రాష్ట్ర నాయకుడు అయిన చంద్రబాబు విజన్ 2047 లక్ష్యసాధనలోనూ టీడీపీ నాయకత్వం బలమైన చోదకశక్తిగా ఎదగాలి. టీడీపీ శ్రేణులు.. పార్టీ నిర్మాణం, బలోపేతంలో చూపే పట్టుదల.. నిబద్ధత.. నిజాయితీలను మిత్రపక్ష పార్టీల మైత్రిబంధం బలోపేతంలోనూ చూపాలన్నదే లోకేశ్ అభిలాష. ఇప్పటివరకు టీడీపీ సిద్ధాంతాలు.. అభివృద్ధి, సంక్షేమ నమూనాను కాపీకొట్టిన పార్టీలు నాయకులు… ఇకపై తమ పార్టీల నిర్మాణంలో లోకేశ్ ఐడియాలజీని అనుకరిస్తారు.” అని మాజీమంత్రి ప్రత్తిపాటి బుధవారం ఒక ప్రకటనలో తెలియచేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular