ePaper
Saturday, April 18, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుస్వర్ణాంధ్ర – స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమాలను పరిశీలించిన ఎంపీడీవో 

స్వర్ణాంధ్ర – స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమాలను పరిశీలించిన ఎంపీడీవో 

📰 Generate e-Paper Clip

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 18: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ్ ఆంధ్ర” కార్యక్రమాన్ని గూడెం కొత్తవీధి మండలంలో ఎంపీడీవో బి.హెచ్.వి రమణబాబు ఆధ్వర్యంలో శనివారం దామనాపల్లి పంచాయతీ కట్టుపల్లి, దేవరపల్లి పంచాయతీ, సంకడ పంచాయతీ, లకవరపేట పంచాయతీలలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. వర్షపు నీటి సంరక్షణ, చెత్త నిర్వహణ, డ్రైనేజీల శుభ్రపరచడం, సోక్ పిట్స్ నిర్మాణం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపర్చడమే లక్ష్యంగా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. తడి చెత్త పొడి చెత్త లను సేకరించారు.“నీటి సానుకూల ఆంధ్రప్రదేశ్” లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలని ఎంపీడీవో రమణబాబు సూచించారు.ప్రతి గ్రామంలో పరిశుభ్రతను కాపాడుకోవడం, చెత్తను సరైన విధంగా నిర్వహించడం చాలా ముఖ్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల డిప్యూటీ ఎంపీడీవోలు జగదీష్, రత్నకుమార్, స్పెషల్ ఆఫీసర్ ఆర్డబ్ల్యూఎస్ జేఈ కళ్యాణ్ బాబు, ఎంపీడీవో కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇమ్మానియేల్, పంచాయితీ కార్యదర్శులు బాలకృష్ణ,ఆర్. లక్ష్మి,పేసా గ్రామ కమిటీ సభ్యులు , గ్రామ సచివాలయ సిబ్బంది,ఆశ అంగన్వాడి కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular