Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజువడగాలుల నేపథ్యంలో ముందస్తు చర్యలపై అవగాహన – ఎంపీడీఓ సూచనలు

వడగాలుల నేపథ్యంలో ముందస్తు చర్యలపై అవగాహన – ఎంపీడీఓ సూచనలు

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 18: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాలుల ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని విపత్తుల నిర్వహణలో భాగంగా సీపీఆర్ మరియు ఇతర అత్యవసర చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మండల పరిధిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ బిహెచ్వి రమణ బాబు  మాట్లాడుతూ వడగాలులు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ప్రజలు అవసరం లేకుండా మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని, తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలని తెలిపారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తలపై గుడ్డ లేదా టోపీ ధరించడం, తేలికపాటి దుస్తులు వేసుకోవడం మంచిదన్నారు.ప్రతి గ్రామంలో ప్రజలకు ఎటువంటి అంతరాయం లేకుండా తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. హెల్త్ కిట్స్ అందుబాటులో ఉంచాలి.అత్యవసర పరిస్థితుల్లో ప్రాణరక్షణకు ఉపయోగపడే సీపీఆర్ విధానంపై కూడా అవగాహన కల్పిస్తూ, గ్రామ స్థాయి సిబ్బంది, అధికారులు ఆరోగ్య సిబ్బంది ప్రజలకు దగ్గరగా ఉండి అవసరమైన సహాయం అందించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు జగదీష్,రత్నకుమార్, ఆర్డబ్ల్యూఎస్ జెఈఈ కళ్యాణ్ బాబు,సెక్రటరీలు బాలకృష్ణ, లక్ష్మి,గ్రామ సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అధికారులు ఇచ్చిన సూచనలను పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎంపీడీఓ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular