టీడీపీ అండగా మంత్రి సుభాష్
రామచంద్రపురం, పెన్ పవర్,ఏప్రిల్ 21: తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ తన కార్యకర్తలకు అండగా నిలుస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. కోట్లాది సభ్యులతో కూడిన ఈ పార్టీ ఒక పెద్ద కుటుంబంలా పనిచేస్తుందని, కష్టకాలంలో కార్యకర్తలు మరియు వారి కుటుంబాలకు తోడుగా ఉండటం పార్టీ ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.రామచంద్రపురం మండలం వేగాయమ్మపేట గ్రామానికి చెందిన కురిపూడి కనకరాజు ఇటీవల అకాల మరణం చెందగా, ఆయన కుటుంబానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రమాద భీమా పథకం ద్వారా మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసాతో పాటు ఆత్మస్థైర్యం కలుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో కార్యకర్తల సంక్షేమం కోసం ఈ భీమా పథకం విజయవంతంగా అమలు అవుతుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తరించనున్నట్లు మంత్రి సుభాష్ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, వైస్ చైర్మన్ దడాల నాగార్జున నాగేశ్వరి,రామచంద్రపురం రూరల్ మండల అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు.

