గార్ల, పెన్ పవర్, ఆగస్టు 4:
ఈనెల 6 నుండి 14 వరకు జరిగే దేశవ్యాప్త ప్రచార జాతాలను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కట్టె బోయిన శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో మంగళవారం ప్రచార యాత్ర వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా బిజెపి పాలనలో దేశం మన పెన్నడూ లేని విధంగా నిరుద్యోగిత పెరిగిందని నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నింటి సామాన్యుడికి పెను భారమైందని, మోదీ కార్పొరేట్ అనుకూల విధానాల వలన దేశ సంపద కేవలం గుప్పెడు మంది చేతిలో కేంద్రీకృతమై, ప్రజల దగ్గర కేవలం కొద్ది సంపద మాత్రమే ఉండడంతో ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరిగిపోయి ఆకలి, దారిద్రం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రూపాయి విలువ పతనం కావడo, విదేశి మార్గ ద్రవ్య నిల్వలు పడిపోతున్నా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నామని గొప్పలు చెప్పుకోవడం మోడీకి ఆనవాయితీగా మారిందని విమర్శించారు. లక్షలాది మంది రైతులు సుదీర్ఘ పోరాటాలు చేసిన కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ కల్పించాలని డిమాండ్ పరిష్కారం కాలేదని, పేదలకు విద్యా, వైద్యం అందని ద్రాక్షగా మారిందని, సంఘటిత రంగ కార్మికులకు పని భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.పోరాటాలు, నిరసనలు, ఆందోళనలతోనే నియంతత్వ విధానాల అవలంబిస్తున్నా మోదీ ప్రభుత్వ మెడలు వంచడానికి ఈనెల 6 నుండి 14 వరకు జరిగే దేశవ్యాప్త ప్రచార జాతాలను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జంపాల వెంకన్న,ధూపాటి జనార్ధన్, దారవత్ వీరన్న, మేదరమెట్ల గిరిప్రసాద్, భూక్య హరినాయక్,కోటేశ్వరి,లావుడ్య భీముడు,మాగం లోకేష్, ఇరుగు వెంకటేష్, కృష్ణయ్య,రాంబాబు, యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.

