ePaper
Wednesday, June 17, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుఅంకితభావానికి కిట్లంగి బాలకృష్ణకు సత్కారం

అంకితభావానికి కిట్లంగి బాలకృష్ణకు సత్కారం

📰 Generate e-Paper Clip

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 24:విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న పెదవలస పంచాయతీ కార్యదర్శి కిట్లంగి బాలకృష్ణను జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జీకేవీధిలో శుక్రవారం ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎంపీపీ బోయినకుమారి, ఎంపీడీవో రమణబాబు మాట్లాడుతూ, బాలకృష్ణ సుదీర్ఘకాలంగా జీకే వీధి మండలంలోని పలు పంచాయతీలలో సేవలందిస్తూ గిరిజన గ్రామాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్న బాలకృష్ణ సేవలు కొనసాగాలని వారు ఆకాంక్షించారు. తన సేవలను గుర్తించి సత్కరించిన అధికారులు, ప్రజాప్రతినిధులకు బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు ఆనందరావు, దేముడు, ఎంపీటీసీ సభ్యులు రాజేశ్వరి, రాజులమ్మ, పరిపాలన అధికారి ఇమ్మానుయేల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular