Homeతెలంగాణఉప్పల్ మినీ శిల్పారామంలో ఆలరించిన ప్రదర్శనలు

ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆలరించిన ప్రదర్శనలు

ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆలరించిన ప్రదర్శనలు

కాప్రా, పెన్ పవర్, నవంబర్ 22 :

ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆదివారం ఎంఎన్ ఆర్ శిరీష శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. ఈ సందర్భంగా అనాధ నర్తన గణపతిమ్, మూషిక వాహన, అన్ని మంత్రాలూ, మధురానగరిలో, నీలమేఘ శరీర, విన్నపాలు, పుష్పాంజలి, జగడపు చనవుల, రామాయణ శబ్దం, త్రిశక్తి నృత్య రూపకం తదితర అంశాలను కళాకారులు వియన్నా, హాసిని, యోగ్య, తిస్య, శ్రీక్షిత, శ్రీనిధి, మోక్ష, మోక్తిక, రుషిక సాయి, హాన్విత, ప్రవస్తి, హేతంశి, షణ్ముఖ, అనన్య తదితరులు ప్రదర్శించి మెప్పించారు. ఆదివారం సెలవు దినం కావడంతో సందర్శకుల నుంచి మంచి స్పందన వచ్చిందని నిర్వహకులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular