ePaper
Sunday, May 10, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడగ్రామాభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు, సర్పంచ్‌లకు సన్మానం

గ్రామాభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు, సర్పంచ్‌లకు సన్మానం

📰 Generate e-Paper Clip

కాజులూరు, పెన్ పవర్,మార్చి 24:
గ్రామ పంచాయతి అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం మంగళవారం కాజులూరు మండల పరిషత్ కార్యాలయం మీటింగ్ హాల్‌లో నిర్వహించారు. మండల అభివృద్ధి అధికారి జె. రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు,వైస్ ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, మండల స్థాయి అధికారులు, పంచాయతి కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, వెలుగు సిబ్బంది, పాత్రికేయులు మరియు మండల పరిషత్ సిబ్బంది పెద్ద ఎత్తున హాజరయ్యారు.ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ స్థాయిలో సమగ్ర అభివృద్ధి కోసం జీపీడీపీ ప్రణాళికలు కీలకమని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుండి విద్య, వైద్యం, సాంకేతిక రంగాలలో పురోగతి సాధించడమే కాకుండా, మౌళిక వసతుల కల్పనలోప్రజాప్రతినిధులు,అధికారులుసమన్వ యంతో పనిచేయాలని సూచించారు.ప్రతి గ్రామం అవసరాలను గుర్తించి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.అనంతరం మధ్యాహ్న భోజనం తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంసజావుగాసాగి, గ్రామాభివృద్ధి దిశగా మరింత చైతన్యం కలిగించింది.ఈ కార్యక్రమంలో జడ్పీ టీసీ వనుం వెంకట సుబ్బారావు, ఎంపీటీసీలు,తహశీల్దార్ జి.ఆర్.ఠాగూర్, ఎంపీడీవో జే.రాంబాబు, డిప్యూటీ ఎంపీడీవో చక్రపాణి,ఏపీఎం రాము,ఎంఈఓ1 డేవిడ్, ఎంఈఓ 2 పి.జాన్,ఏపీవో బి.వెంకటలక్ష్మి, సర్పంచులు పోతురాజు ప్రసన్న మౌనిక, దండంగిసరోజిని, వనుంసూర్యావతి, నరాలసుబ్యబరాజు,పెద్దిరెడ్డి రామచంద్రావు,కోమలివెంకటరమణ,పోతుల గనిరాజు,  నెల్లిబ్రహ్మాజీ,డేగలతిరుమలవేణి,వడ్డపాటి భాస్కరరావు,కార్యదర్శులు,డిజిటల్అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular