ePaper
Monday, May 25, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు 

ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు 

📰 Generate e-Paper Clip


గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 29:జీకే వీధి మండలంలో రింతాడ పంచాయితీ పరిధిలోని ఆసరాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. మొదట నందమూరి తారక రామారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ సీనియర్ కార్యకర్తలు, మహిళలకు సాలువాలు, చీరలు అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జీసీసీ చైర్మన్ ఎం.వి.వి.ఎస్. ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు పోత్తూరు కొండలరావు,పిఎసిఎస్ చైర్మన్ మొట్టడం నూకరాజు,దేవర పల్లి సర్పంచ్ సిరిబాల బుజ్జిబాబు, మండల ఉపాధ్యక్షుడు పాడి శ్రీనివాస్‌రావు, ఆర్గనైజేషన్ సెక్రటరీ మొట్టడం వి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, చింతపల్లి మార్కెట్ డైరెక్టర్ మొట్టడం శరభన్నదోర, పార్టీ సీనియర్ నాయకులు మొట్టడం రామకృష్ణ, పాంగి రాజారావు,ముర్ల కోటేశ్వరరావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు లకే రామారావు తదితరులు పాల్గొన్నారు.అలాగే రింతాడ పంచాయతీకి చెందిన సీనియర్ కార్యకర్తలు కిళ్లో సింహాచలం, సాగిన రంగారావు, తగ్గి శ్రీరాములు మరియు మహిళా కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular