ePaper
Sunday, May 10, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుపది తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన తహసిల్దార్ 

పది తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన తహసిల్దార్ 

📰 Generate e-Paper Clip

గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మార్చి 25 ,జీకేవీధి మండలంలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను తహసీల్దార్ హెచ్. అన్నాజీరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘ఏ’, ‘బి’ పరీక్షా కేంద్రాలను ఆయన పరిశీలించారు.పరీక్ష నిర్వహణ తీరును సమీక్షించిన తహసీల్దార్, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయా లేదా అన్న విషయాన్ని ప్రత్యేకంగా గమనించారు.ఈ సందర్భంగా మాస్ కాపీయింగ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని సూచించారు. ఎవరైనా నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సంబంధిత ఇన్విజిలేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular