ePaper
Monday, April 20, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంఆంధ్ర, తెలంగాణ సరిహద్దులో అక్రమ పశువుల రవాణా

ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులో అక్రమ పశువుల రవాణా

📰 Generate e-Paper Clip

చింతూరు, పెన్ పవర్ ఏప్రిల్ 19:

ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వైపు అక్రమంగా పశువులను తరలించే కార్యకలాపాలు కొత్త మలుపు తిరిగాయి. ఇప్పటివరకు సాధారణ మార్గాల్లో కొనసాగిన ఈ రవాణా, తాజాగా ఇసుక లారీలను అడ్డుగా పెట్టుకుని జరుగుతోందని సమాచారం. దాటించే వ్యక్తులు అధికారుల కంటపడకుండా ఉండేందుకు రూట్లను కూడా మారుస్తున్నారు. ముఖ్యంగా చింతూరు నుంచి భద్రాచలం మీదుగా వెళ్లే మార్గాన్ని ఉపయోగిస్తూ, ఇసుక లారీలలో పశువులను దాచిపెట్టి తరలిస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ విధానం పుష్ప సినిమాను తలపించేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ అక్రమ రవాణాకు కొందరు స్థానికుల సహకారం కూడా ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత శాఖలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటేనే ఈ అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందని ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, అక్రమ పశువుల రవాణా వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ వ్యవహారంలో కీలక వ్యక్తుల వివరాలు బయటపడే అవకాశం ఉందని సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular